* రెండు టీచర్, ఒక పట్టభద్రుల స్థానానికి నామినేషన్ల ప్రక్రియ షురూ
* ఈ నెల 10 వరకు ప్రక్రియ.. 11న స్క్రూట్నీ
* 13న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం
* 27న పోలింగ్.. మార్చి 3న ఎన్నికల ఫలితాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): తెలంగాణలో శాసనమండలి ఎన్నికల దడి వాతావరణం మొదలైంది. మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానం, ఇదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, వరంగల్- ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. అభ్యర్థులు మెదక్- నిజా ఆదిలాబాద్- కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాలకు కరీంనగర్ కలెక్టరేట్, వరంగల్- ఖమ్మం- ఎమ్మెల్సీ స్థానానికి నల్గొండ కలెక్టరేట్‌లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. సోమవారం నుంచి నామి ప్రక్రియ సైతం మొదలైంది.
తొలిరోజు పది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారులు ఈ నెల 10 వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 11న నామినేషన్లను స్క్రూట్నీ చేస్తారు. 13న నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఇస్తారు.
27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలు కానున్నది. ఎన్నికల కోడ్ అమలుపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిం ఆదేశించారు. పోలింగ్‌కు కేంద్రాలను గు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చే సూచించారు. రిటర్నింగ్ అధికారు ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని, అలాగే ఎన్నికల సిబ్బందికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి..
అధికార కాంగ్రెస్ పార్టీ మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభ స్థానానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం అక్కడి ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన మరోసారి పోటీచేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో పార్టీ అధిష్ఠానం నరేందర్‌రెడ్డి ఎంపిక చేసిన తెలిసింది.
ఇక రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయాలా..? వద్దా..? అనే అంశంపై పార్టీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నల్లగొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మె స్థానం నుంచి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాలిరెడ్డి హర్షవర్థన్‌రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కానీ.. అధిష్ఠానం మాత్రం పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ఆసక్తి చూపడం లేదని, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో మిత్రపక్ష ఉపాధ్యాయ సంఘాలకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ మాత్రం రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించడమే కాక, ప్రచారం కూడా షురూ చేసింది. మరోవైపు పీఆర్టీయూఎస్, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నేతలు సైతం పోటీకి సై అంటున్నారు.