23-02-2025 11:36:04 AM
కాగజ్ నగర్,(విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) సమీపిస్తున్న తరుణంలో ప్రచారంలో నాయకులు జోరుపెంచారు. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అన్నివిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాగజ్ నగర్ పట్టణంలో ఆదివారం మార్నింగ్ వాకింగ్ కు వచ్చిన విద్యావంతులు, పట్టభద్రులను ఎమ్మెల్సీ దండే విఠల్(MLC Dande Vittal) ఈనెల 27న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. విద్యావంతుల సమస్యలు తీరాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు. నరేందర్ రెడ్డి ని గెలిపిస్తే శాసన మండలిలో పట్టభద్రుల పక్షాన నిలుస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు షబ్బీర్ హుస్సేన్, పొన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు