25-02-2025 07:20:34 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో ఫిబ్రవరి 27వ తేదీన పట్టభద్రుల, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నిర్వహించిన ప్రచారం మంగళవారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మెదక్, నిజామాద్, ఆదిలబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరుగుతున్న నాలుగు ఉమ్మడి జిల్లాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం 680 పోలీంగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
అందులో 93 కామన్ పోలీంగ్ స్టేషన్లు(టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్), 406 గ్రాడ్యుయేట్ పోలీంగ్ కేంద్రాలు, 181 టీచర్స్ పోలీంగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెదక్, నిజామాద్, ఆదిలబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 3,41,313 మంది ఓటర్లు ఉన్న గ్రాడ్యుయేట్ స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19 మంది పోటీలో ఉండగా.. మొత్తం 24,905 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 27న పోలింగ్ ఉన్నాందున్న ఆయా జిల్లాల్లో మద్యం షాపులు మూతపడ్డాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల ఈ పోలీంగ్ జరగనుంది.