కుమ్రంభీం అసిఫాబాద్,(విజయక్రాంతి): చదువుతోపాటు క్రీడలను రాణించాలని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. పెంచికల్ పేట్ మండలం కమ్మార్గాంలో 5 రోజుల పాటు నిర్వహించిన వాలీబాల్ పోటీలలో పొందిన జట్లకు ఆదివారం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రథనోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ... యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కమ్మర్గం గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను వివరించగా అతి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బెజ్జురు నుండి కమ్మార్గం వరకు బస్ నడిచేలా రోడ్ సౌకర్యం కల్పించినందుకు యువకులు యువత ధన్యవాదాలు తెలిపారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన మొర్లిగూడ జట్టుకు మొదటి బహుమతి రూ.15 వేలు, సిల్డ్ ఇవ్వగా రెండవ బహుమతిగా కామ్మర్గం జట్టుకు రూ.10 వేలు, సిల్డు అందజేశారు. కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సిడం గణపతి ,మాజీ జడ్పీటీసీ సభ్యులు సముద్రాల సరిత, రాజన్న ,టిపిసిసి సభ్యులు అర్షద్ హుస్సేన్ ,రాచకొండ కృష్ణ ,కమ్మర్గాం మాజీ సర్పంచ్ మధునయ్య ,ఆత్రం బాపు, చంద్రమౌళి ,శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.