డీఎస్పీ ఉద్యోగానికి వలంటరీ రిటైర్మెంట్
కామారెడ్డి, నవంబర్4 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన మదనం గంగాధర్ తన డీఎస్పీ ఉద్యోగానికి వలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధ్దమయ్యారు. నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మె ల్సీ స్థానానికి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. మధనం గంగాధర్ నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. 22 ఏళ్ల వయస్సులోనే మొదటి ప్రయత్నంలోనే 1998 బ్యాచ్‌లో ఎస్సైగా ఎంపికయ్యారు. 2010లో సీఐగా పదోన్నతి పొందారు. ఇటీవలే డీఎస్పీ అయ్యారు. ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్లు గంగాధర్ తెలిపారు.