calender_icon.png 6 January, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగులు అధైర్య పడవద్దు

04-01-2025 01:47:09 PM

పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత స్థితికి రావాలని

మీ సంక్షేమం కోసం పాటుపడుతా

మంథని లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి

మంథని (విజయక్రాంతి): నిరుద్యోగులు అధైర్య పడవద్దని, పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత స్థితికి రావాలని, ప్రతి నిరుద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతనాని ము కోసమే ఈ  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆశీర్వదించాలని, మంథనిలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి మంథని పట్టణం ఎస్ఎల్బి గార్డెన్ లో మంథని విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కొండేలా మారుతి అధ్యక్షతన జరిగిన వి. నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్, నిజామాబాద్ ఆదిలాబాద్, కరీంనగర్, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ  కార్యక్రమంలో  ముందుగా నరేందర్ రెడ్డి సరస్వతీ దేవికి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు గర్వపడుతున్నానని, పట్టభద్రులకు సేవ చేసుకునేందుకు అవకాశం వచ్చిందని, వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పట్టభద్రులు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు నెలకొల్పి 35 సంవత్సరాలు పూర్తయిందని, గత 35 సంవత్సరాలుగా విద్యార్థులకు సేవ చేస్తూ, వారి ఉన్నత జీవితానికి కృషి చేస్తున్నానని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగుల తరఫున గొంతుకనై పని చేస్తానని అయిన పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లు వచ్చేలా ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు.

పట్టభద్రుల కోసం, నిరుద్యోగుల సంక్షేమ కోసం ఎల్లప్పుడు పాటుపడుతూ, అంధుబాటులో ఉంటానన్నారు. జిల్లా టిడిపి నాయకులు అక్కపాక తిరుపతి, విద్యార్థి నాయకులు బెజ్జంకి డిగబంర్, ఆర్ల సందీప్,  నాయకులు బూడిద తిరుపతి, బాపు గౌడ్,  న్యాయవాదులు సతీష్,  పాత్రికేయులు దహగం శ్రీనివాస్, గడిపెళ్లి అజయ్, మారుతి చంద్రమోహన్, శ్రావణ్, మహమ్మద్ ఖాన్, సతీష్, శంకర్, రాజుగౌడ్, కిషన్ యాదవ్, మల్లేష్ యాదవ్,  మాజీ సర్పంచ్ నారాయణ, చిల్లప్ప గారి సునీల్, ఉపాధ్యాయురాలు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సీనియర్ అధ్యాపకులు లక్ష్మిని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఘనంగా శాలువతో సన్మానించి సత్కరించారు.