22-02-2025 12:40:04 AM
చేగుంట, ఫిబ్రవరి 21 : చేగుంట మండలంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సర్వ శిక్ష ఉద్యోగులు మాలోత్ రమేష్, ఎర్ర శ్రీనివాస్ కుటుంబాలను శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ పరామర్శించారు. అనంతరం వారి కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు, ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ మరణించిన సమగ్ర శిక్షణ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎ జిల్లా అధ్యక్షులు రాజు పాల్గొన్నారు.