calender_icon.png 21 February, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు అమలు చేయాలని నిలదీసినందుకే కాంగ్రెస్ సస్పెండ్ చేసింది

15-02-2025 10:48:55 PM

కరీంనగర్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్

బెల్లంపల్లి,(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీసినందుకే కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ చేసిందని కరీంనగర్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ ఆరోపించారు. శనివారం సాయంత్రం బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో రేవంత్‌రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు.4.20 కోట్ల తెలంగాణ జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ సమగ్ర సర్వే పేరుతో 3.54 కోట్లుగా చూపుతూ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. 66 లక్షల జనాభాను సర్వేలో చూపకుండా ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడంలో ,యూనివర్సిటీలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని చెప్పారు.మెదక్,కరీంనగర్,నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభధ్రుల సమస్యల పరిష్కారం కోసం మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి కరీంనగర్ పట్టభధ్రుల ఎమ్మెల్సీగా తనను గెలిపించాలని అభ్యర్థించారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ 1.79 కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు గొప్పలు చెబుతున్నారని ఆయన విమర్శించారు.