calender_icon.png 16 January, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాం విద్యార్థులతో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చర్చలు.. తాత్కాలికంగా విరమణ

08-08-2024 06:16:01 PM

హైదరాబాద్: నిజాం కళాశాల విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత ఆరు రోజుల నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. డిగ్రీ విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించాలని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తుండడంతో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రంగంలోకి దిగి నిజాం కళాశాల వైస్ ప్రిన్సిపల్ తో చర్చలు జరిపారు. దీంతో గురువారం కూడా నిరసన తెలుపుతూ, తాత్కాలికంగా నిరసనను విరమిస్తున్నట్లు డిగ్రీ విద్యార్థినులు వెల్లడించారు. 

విద్యార్థులు తరగతులకు హాజరవ్వకుండా కాలేజీ ముందు ఆందోళన చేస్తుంటే బల్మూరి వెంకట్ ధర్నా చేస్తున్న వారి వద్దకి వచ్చి విద్యార్థినులతో చర్చిందచారు. సెప్టెంబర్ తో పీజీ విద్యార్థుల కోర్సు పూర్తవుతుందని, తర్వాత డిగ్రీ విద్యార్థులకే హాస్టల్ వసతి ఉంటుందని వెంకట్ పేర్కొన్నారు. దీనిపై మూడు రోజుల్లో అధికారికంగా సర్కులేషన్ ఇప్పిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో డిగ్రీ విద్యార్థినులు నామమాత్రంగా నిరసనను విరమించారు. దీంతో పీజీ విద్యార్థులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు.

గర్ల్స్ హాస్టల్ డిగ్రీ వాళ్లకే కేటాయిస్తే, తాము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రావాల్సి వస్తోందని, ఈ ట్రాఫిక్‌లో బస్సుల్లో ప్రయాణం చేసి కాలేజీకి సమయానికి రాలేకపోతున్నామని పీజీలు ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ ఆవరణంలో మరో భవనం నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందని సీనియర్లు చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీతో చర్చించి, సమస్యను పరిష్కరిస్తానని పీజీ విద్యార్థినులకు బల్మూరి వెంకట్ హామీ ఇచ్చారు.