02-04-2025 09:55:29 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని రామన్ కాలనీ ప్రాంతానికి చెందిన దాసరి రమాదేవి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందిగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని బుదవారం ఆయన పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతురాలి కుమారుడు సాయి కృష్ణ ఎమ్మెల్సీ వెంకట్ పిఎ గా పనిచేస్తున్నారు. విషయం తెలిసిన ఎమ్మెల్సీ బాధిత కుటుంబాన్ని పరామర్శించి అధైర్య పడవద్దని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.