21-03-2025 12:00:00 AM
పటాన్ చెరు, మార్చి 20 : కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిల్లీలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్ తో కలిసి అంజిరెడ్డి తన సతీమణి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అమిత్ షాను కలిసిన వారిలో ఎంపీలు డీకే అరుణ, రఘునందన్రావు, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేశ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఉన్నారు.