calender_icon.png 20 January, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలి

20-01-2025 12:19:05 AM

ముషీరాబాద్,(విజయక్రాంతి): పెన్షనర్ల చెల్లింపులు వాయిదా వేయడం కోసం ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలన్న ప్రభుత్వ యోచన సరైంది కాదని, ఆ ప్రతిపాదనను విరమించుకొని పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం దోమలగూడలోని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ బేరర్స్ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. పీఆర్‌సీ నివేదికను వెంటనే తెప్పించి సంఘాలతో చర్చించి 2023 జూలై 1 నుండి అమలు చేయాలని అన్నారు. బకాయిపడిన నాలుగు వాయిదాల కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్, ఉపాధ్యక్షుడు కే. జంగయ్య, కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, రాములు, జి. సమ్మారావు, కే. రంజిత్‌కుమార్, జి. నాగమణి, డి. సత్యానంద్, మల్లారెడ్డి, శ్రీధర్, రవికుమార్, రవి ప్రసాద్ గౌడ్, జ్ఞానమంజరి, సంహాచలం, వెంకటప్ప, యాకయ్య, ప్రధాన సంపాదకులు పి. మానిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.