calender_icon.png 12 April, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ జన్మదిన వేడుకలు

04-04-2025 11:11:29 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని కృష్ణ సాగర్ గ్రామంలో జాతీయ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ జన్మదిన వేడుకలను జాతీయ మాల మహానాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు బోడ దివ్య ఆధ్వర్యంలో స్వీట్స్ పంచి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు బోడ దివ్య మాట్లాడుతూ... దళిత ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమ నేత అద్దంకి దయాకర్ భవిష్యత్తులో ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయపూడి నిర్మల, బెజ్జం రాణి, ఎలిజాల కళ, ఎలిజాల అగ్ని, అంతోటి నిర్మల, అంతోటి నందిని, భూదేవి, మల్ల రామచందర్, మోత్కూరు లక్ష్మి, అంతోటి సూరి, అంతోటి పూజ, అంతోటి లీల, బోడ కృష్ణ, రాయపూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.