మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): రేవంత్ సర్కార్‌కు దమ్ముంటే పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పోలీసులతో చేస్తున్న అరాచక పాలన, అరెస్టులు, ప్రశ్నించిన వారిపై పెడుతున్న కేసులు అన్నీ ప్రజలు గమని స్తున్నారని పేర్కొన్నారు. త్వరలో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.