calender_icon.png 3 April, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు

31-03-2025 01:29:35 AM

హనుమకొండ, మార్చి 30 (విజయ క్రాంతి): స్వస్తిశ్రీ శ్రీమత్ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో  వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందినారు. తొలుత ఆలయ అర్చకులు  వేదమంత్రాల నడుమ ఎమ్మెల్యే లకు స్వాగతం పలికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.అనంతరం లక్షల పూల అర్చన సందర్భంగా అమ్మవారికి పుష్పాలు సమర్పించిన ఎమ్మెల్యేలు. తదనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శేషు భారతి కి ’ఆగమాడునికి’ బిరుదు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యేలు శాలువాతో సత్కరించారు.ఆలయ ప్రాంగణంలో ఉన్న  షిరిడి సాయినాధుకి ఎమ్మెల్యేలు  దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ స్వస్తిశ్రీ శ్రీమత్ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవితాల్లో నూతన అభివృద్ధి సాధించాలని  హనుమకొండ జిల్లా ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ఈ ఉగాది పండుగ ప్రజలందరికీ సకల శుభాలను పంచాలన్నారు. ప్రజల జీవితాల్లో సుఖ శాంతులు తేవాలని,కష్టాలు,నష్టాలు తొలగి ఆనందమయ జీవితాలకు ఈ పండుగ నాంధి కావాలని,సమృద్ధిగా వర్షాలు కురువాలని,పంటలు బాగా పండాలని, రైతులు బాగుండాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు. నిరుద్యోగులకు ఈ ఏడాది ఉద్యోగ నామ సంవత్సరం కావాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ కుందూరు వెంకట్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి సురేందర్, కార్పొరేటర్ జక్కుల రవీందర్, కాజీపేట తహసిల్దార్ బావ్ సింగ్, కాంగ్రెస్ నాయకులు బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డి, పల్లె రాహుల్ రెడ్డి, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.