calender_icon.png 31 October, 2024 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేల కొనుగోళ్లకు వేలం వేయాలి

07-07-2024 01:39:37 AM

ఎన్నికలను నిలిపివేయాలి

బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ఫిరాయింపులను ఆపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వేలం పాటలు పెట్టాలని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. శనివారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ నిర్లజ్జగా జరుగుతున్న రాజకీయ పార్టీల ఫిరాయింపులు ఆపలేక పోతే భారత ఎన్నికల సంఘం ఎన్నికలను ఆపి, వేలం పాటలు పెట్టి, అత్యధిక ధర పలికినవారికి, ఎమ్మెల్యే స్థానాలను కట్టబెట్టడం మంచిదని పేర్కొన్నారు. కులం, ధన, అబద్దపు మాటలతో తెలంగాణలో అధికారం హస్తగతం చేసుకున్న కురచ మనస్తత్వం గల వ్యక్తులు, ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికైన ప్రతినిధులను బ్లాక్ మెయిల్, బెదిరింపులకు గురి చేసి కొనుగోలు చేస్తూ ప్రజలిచ్చిన తీర్పును, ఎన్నికల ప్రక్రియను ఆపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.