calender_icon.png 13 April, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా శోభాయాత్ర

06-04-2025 10:09:32 PM

కామారెడ్డి జిల్లాలో శోభయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యేలు..

పోలీసుల భారీ బందోబస్తు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం శోభయాత్రను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(MLA Katipally Venkataramana Reddy) ప్రారంభించారు. బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(MLA Thota Lakshmi Kantha Rao) శోభయాత్ర ప్రారంభించి పాల్గొన్నారు. బాన్సువాడ ఎల్లారెడ్డిలో శోభయాత్ర నిర్వహించారు. వేలాది మంది హిందూ వాహిని ప్రతినిధులు శోభయాత్రలో పాల్గొన్నారు. డీజే సౌండ్ సిస్టంతో పాటు లైటింగ్ ఏర్పాటు చేసి ప్రధాన వీధుల గుండా శోభాయాత్రను నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. శోభాయాత్ర అర్ధరాత్రి వరకు చేపట్టారు. ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ నాయకులతో పాటు హిందూ వాహిని సోదరులు పాల్గొన్నారు.