19-02-2025 07:35:44 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి(New Chief Minister of Delhi) ఎంపికపై ఉత్కంఠ ఏర్పడింది. 27 ఏళ్ల విరామం తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం బుధవారం నిర్వహించింది. బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు, కేంద్ర పరిశీలకుల భేటీలో తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష నేత(Delhi BJP Legislature Party Leader)ను నేతలు ఎన్నుకోనున్నారు. ఈ భేటీలో రవిశంకర్ ప్రసాద్, ఓంప్రకాశ్ ధన్ ఖడ్ పాల్గొన్నారు. రేపు ఉదయం 11.00 గంటలకు నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుంది. ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగగా.. 8న ఫలితాలు ప్రకటించబడ్డాయి. బహుళ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా, ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.