calender_icon.png 6 January, 2025 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేల ‘ముష్టి’ యుద్ధం

07-12-2024 01:33:28 AM

  1. *జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370 రచ్చ

ఢిల్లీ: ఆర్టికల్ 370 గురించి జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ముష్టి యుద్ధాలకు దిగారు. గురువారం నాటి సమావేశంలో ఎంపీ ఇంజినీర్ రషీద్ సోదరుడైన ఖుర్షీద్ ఆర్టికల్ 370కి సంబంధించిన బ్యానర్‌ను ప్రదర్శించడంతో గొడవ మొదలైంది. దానిని బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ తప్పుబట్టారు. ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఇది చోటు చేసుకుంది. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఆరేళ్ల తర్వాత సమావేశమైన తొలి సభలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సభలో సభ్యులు మాట్లాడుతున్న సమయంలో అవామీ ఇత్తేహద్ పార్టీ ఎమ్మెల్యే అయిన ఖుర్షీద్ ఒక్కసారిగా పోడియంలోకి దూసుకొచ్చి ఆర్టికల్ 370కి సంబంధించిన బ్యానర్‌ను ప్రదర్శించాడు. ఇది బీజేపీ సభ్యులు వ్యతిరేఖించడంతో గొడవ మొదలైంది. దీంతో స్పీకర్ అబ్దుల్ సభను వాయిదా వేశారు. 

మాకు 370 కావాల్సిందే.. 

అధికార పార్టీ పీడీపీ ఆర్టికల్ 370తో పాటు ఆర్టికల్ 35(ఏ)ను కూడా పునరుద్ధరించాలని తీర్మానం పాస్ చేసింది. ఈ తీర్మానం మీద మాజీ మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ స్పందిస్తూ.. ఈ నిర్ణయం రాజ్యాంగంతో పాటు సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని గౌరవించకపోవడమే అని అన్నారు.  దళితులు, ఆదివాసీలు, మహిళలు, చిన్నారుల హక్కుల కోసం పోరాడుతున్నాం అని చెప్పే రాహుల్ గాంధీ కుటుంబం ఈ నిర్ణయం ఎంత వరకు సరైందో చెప్పాలని డిమాండ్ చేశారు.