calender_icon.png 19 November, 2024 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవు: కేటీఆర్

05-08-2024 01:05:46 PM

హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పైన ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తామన్నారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశం అయినట్లు తెలిపారు. త్వరలోనే సుప్రీం కోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నట్లు పేర్కొన్నారు. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో రాజ్యాంగ నిపుణులు స్పష్టత వస్తుందన్నారని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది. అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఈ రోజు పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది.