15-10-2024 12:07:53 AM
గద్వాల (వనపర్తి), అక్టోబర్ 14 (విజయక్రాంతి): గద్వాల జిల్లా మానవపాడు మండ లం చిన్నపోతుల పాడు గ్రామంలో ఈ నెల 10న దళిత మహిళ ప్రశాంతమ్మ(ఎస్తేరమ్మ) పై వారి పక్కింటిలో ఉండే యుగంధర్, సత్తి, అరుణమ్మ ఈ నెల 10న వేడి నూనెను చల్లా రు. ప్రశాంతమ్మ ఏపీలోని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. సోమవారం సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు ఆమెను పరామర్శించి మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులను ఆదేశించారు. కాగా ఈ నెల 10న ఘటన జరిగితే ఇంతరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడం విడ్డూరం.