calender_icon.png 19 April, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పందించిన ఎమ్మెల్యే యెన్నం

19-04-2025 01:44:37 PM

మ్యాతరి గోపాల్ ను రప్పించేందుకు రాష్ట్ర ప్రత్యేక విభాగ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే 

మ్యాతరి గోపాల్ స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకుంటాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లాలోని హన్వాడ మండలం(Hanwada mandal) పెద్దధర్పల్లి గ్రామానికి చెందిన మ్యాతరి గోపాల్ గల్ఫ్ దేశమైన దుబాయ్ లో పలు కారణాలతో అక్కడే చిక్కుపోయిన విషయాన్ని విజయ క్రాంతి దినపత్రిక(Vijaya Kranthi Daily Newspaper) ప్రత్యేక కథనంను ప్రచురితం చేసింది. ఈ విషయం పై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy)  ప్రత్యేకంగా దృష్టి సారించారు. మేతరి గోపాల్ ఇబ్బందుల్లో ఉన్నారు విదేశాల్లో అనే విషయాన్ని తెలుసుకున్న  ఎమ్మెల్యే గంటల వ్యవధిలోనే రాష్ట్ర సచివాలయంలో విదేశాల్లో మన దేశస్థులకు ఇతర దేశాలలో ఇబ్బందులు ఉన్న పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక విభాగ అధికారులతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.

మ్యాతరి గోపాల్ కు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత రాష్ట్ర అధికారులకు నివేదించారు. సంబంధిత రాష్ట్ర అధికార యంత్రాంగంకు పూర్తిస్థాయిలో వివరాలు అందివ్వడం జరిగిందన్నారు. మ్యాతరి గోపాల్ తిరిగి ఇండియాకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సంబంధిత అధికారులు చెప్పడం జరిగిందని ఎమ్మెల్యే  విజయ క్రాంతి దినపత్రిక కు తెలియజేశారు. గోపాల్ స్వగృహం చేరుకునేంత వరకు పూర్తిస్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ సంబంధిత అధికారులతో చర్చలు జరిపి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందకూడదని గోపాల్ స్వేచ్ఛగా తిరిగి ఇంటికి వస్తారని ఎమ్మెల్యే తెలిపారు.