calender_icon.png 23 December, 2024 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వరాజ్యం నా జన్మ హక్కు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

16-09-2024 12:50:26 PM

మహబూబ్​నగర్ : స్వాతంత్ర సమరయోధుల్లో మొట్టమొదట స్వతంత్రం నా జన్మ హక్కు అంటూ నినందించిన మొదటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తా దగ్గర బాలగంగాధర్ తిలక్ విగ్రహాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలగంగాధర్ తిలక్ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎంతోమందికి ఆదర్శప్రాయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, చంద్రయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్, బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్,  లక్ష్మణ్ యాదవ్ మెట్టుకాడి శ్రీనివాస్, రామాంజనేయులు , పాండురంగం, అంజయ్య యాదవ్, ప్రశాంత్, లక్ష్మణ్ నాయక్, శ్రీనివాసులు, మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.