calender_icon.png 16 November, 2024 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవసరమైన ఇసుక అందుబాటులో ఉంచండి

16-11-2024 08:37:13 PM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వ పనులకు, ఇంటి నిర్మాణాలకు అవసరాలకు ఇసుక రీచ్ లను గుర్తించి అవసరమైన వారికి అందుబాటులోకి తీసుకువచ్చేలా  చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో జిల్లా  స్థాయి ఇసుక కమిటీ సమావేశం లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... మహబూబ్ నగర్, జడ్చర్ల పట్టణంలో ప్రజలు ఇండ్లు నిర్మించుకునేందుకు ఇసుక లభించక ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు ఆగిపోవడంతో నిర్మాణాలు జరుగుతున్నాయని, అధికారులు ప్రణాళిక ప్రకారం ఇసుక రీచ్ లను గుర్తించి సంబంధిత అధికారులు సామాన్య ప్రజలకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పట్టదారులు దరఖాస్తు చేసుకున్న వాటికి ఇసుక రీచ్ కు అనుమతులు త్వరగా మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ ఆదాయంకు గండి పడకుండా అక్రమ ఇసుక మైనింగ్ రవాణాపై కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ... ఇరిగేషన్, రెవెన్యూ, భూగర్బ జల వనరుల శాఖ, మైన్స్ శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ అవసరాలకు, మన ఇసుక వాహనం ఆన్ లైన్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకున్న వారికి ఇసుక లభ్యతకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక  అక్రమ మైనింగ్, రవాణా  కట్టడికి  చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గనుల శాఖ సహాయ సంచాలకులు సంజయ్, భూగర్భ జల వనరుల శాఖ డీడీ రమాదేవి, టీజీఎండీసీ ప్రాజెక్ట్ మేనేజర్ రంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.