calender_icon.png 22 February, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ మంచి భవిష్యత్తు కోసం చదవండి

21-02-2025 12:08:15 PM

పదవ తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ పుస్తకాలను అందించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్​నగర్​,(విజయక్రాంతి): మీలో ప్రతి ఒక్కరు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటే మీ కుటుంబ సభ్యుల అందరు భవిష్యత్తు బాగుంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahabubnagar MLA Yennam Srinivas Reddy) అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంs లోని వార్డు నెంబర్ 15, చిన్న దర్పల్లి, హన్వాడ మండలం గొండ్యాల, మండలం వేపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుక డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్(Digital Content Study Materials) కేవలం మన మహబూబ్ నగర్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. 

ఇన్ని రోజులు ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను మరోసారి రివిజన్ చేయాలని చెప్పారు. మీరంతా ఇంటర్మీడియట్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరాలని అక్కడ సుశిక్షితులైన అధ్యాపకులు ఉన్నారని, ఇంటర్మీడియట్ తో పాటుగా ఇంజనీరింగ్, మెడికల్ కోసం తన సొంత నిధులతో ఉచితంగా ఎంట్రెన్స్ పరీక్ష కోసం 200 మంది విద్యార్థులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశామని, మీరు ఇంటర్మీడియట్ ప్రభుత్వం కళాశాలలో చేరితే మీ తల్లిదండ్రులకు కూడా ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎంఓ బాలు యాదవ్, ప్రధానోపాధ్యాయులు శైలజ, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు లక్ష్మణ్ నాయక్, రమేష్ నాయక్, యాదయ్య యాదవ్, యం. నాగరాజు యాదవ్, రమేష్ యాదవ్, రవి నాయక్, యాదగిరి నాయక్, ఆంజనేయులు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.