calender_icon.png 28 November, 2024 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సంక్షేమమే ముఖ్యం.. చిల్లర రాజకీయాలకు తావివ్వం

28-11-2024 11:12:52 AM

 రూ.1.35 కోట్ల నిర్మాణంతో నిర్మించనున్న చిల్డ్రన్ హోమ్ భవనానికి శంకుస్థాపన చేసిన  ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్, (విజయ క్రాంతి) : ప్రజల సంక్షేమమే అతి ముఖ్యమైన  పనిగా ముందుకు సాగుతామని చిల్లర రాజకీయాలకు ఎట్టి పరిస్థితిలో తావివ్వమని  మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టు గడ్డ ప్రాంతంలోని బాల సదన్ లో రూ .1 కోటి 35 లక్షల రూపాయలతో చిల్డ్రన్స్ హోం అధునాతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ... గతంలో అరకొర వసతులతో నడుస్తున్న ఈ బాల సదన్ ను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అధునాతన భవన నిర్మాణానికి అనుమతులు తీసుకురావడం జరిగింని చెప్పారు.  ఈ భవనాన్ని సంవత్సరం లోపు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. బాల సదన్ లో 5 సంవత్సరాల లోపు బాలబాలికలకు ప్లే స్కూల్ మాదిరిగా ఉండేటట్లు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం ఏbవిధంగా అయితే శ్రద్ద తీసుకుంటారో  అలాగే ఈ బాల సదన్ ఉంటుందని స్పష్టం చేశారు.  కేవలం అనాధ పిల్లలే కాకుండా పట్టణంలోని చిన్నారులు ఎవరైనా ఇక్కడ చేరవచ్చు చెప్పారు.  

గత పది సంవత్సరాలుగా ఇలాంటి సంస్థల్లో ఉండాల్సిన వసతులు గురించి పట్టించుకోలేదని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.  రానున్న రెండు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు సొంత భవనాలు నిర్మించుకుని సొంత భవనాల్లో కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అక్కడ సరిదిద్దుకొని మంచి పరిపాలన అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.  అనవసర రాజకీయాలకు తావివ్వమని ప్రజల మంచే మాకు ముఖ్యమనే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  కౌన్సిలర్ రోజా తిరుమల వెంకటేష్, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి జరీనా బేగం , సిడిపిఓ శైలశ్రీ,  తదితరులు పాల్గొన్నారు.