calender_icon.png 27 January, 2025 | 11:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణికులకు రక్షణ కవచం బస్ స్టాండ్‌లు

26-01-2025 02:40:22 PM

అవసరమైన అన్ని ప్రాంతాల్లో బస్టాండ్లు ఏర్పాటు చేస్తాం 

ప్రజల ప్రయాణానికి నిర్దిష్ట స్థలం అవసరం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల ప్రయాణానికి ఒక రక్షణ కవచంలా బస్టాండ్ లు నిలుస్తాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని అప్పన్నపల్లిలో ముడా నిధులతో రూ.2.50 లక్షలతో నూతనంగా నిర్మించిన బస్ స్టాప్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ... ప్రజలకు అవసరమైన సదుపాయాలు అన్ని కల్పిస్తామని తెలిపారు. మూడ ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమని పేర్కొన్నారు.

వెంకటేష్ ను పరామర్శించిన ఎమ్మెల్యే..

కాంగ్రెస్ కార్యకర్త వంటల వెంకటేష్ ఇటీవల అనారోగ్యంకి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దిటిపల్లి డబుల్ బెడ్ రూమ్ లో నివాసం ఉంటున్న వెంకటేష్ ఇంటికి చేరుకొని అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆరోగ్య మెరుగుపడ్డందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ప్రతి కార్యకర్తను ప్రజలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కౌన్సిలర్ రామాంజనేయుల, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు శివశంకర్, చర్ల శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,  ప్రజలు పాల్గొన్నారు.