calender_icon.png 24 February, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన అభివృద్ధి.. మన చేతుల్లోనే

18-02-2025 02:51:37 PM

అందరం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం

పేద విద్యార్థులు చదువుకునేంత సౌకర్యాలు కల్పిద్దాం

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మన అభివృద్ధి మన చేతుల్లోనే ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. రూ 2 లక్షల  ఎస్డిఎఫ్ నిధుల(SDF Funds) ద్వారా  విద్యార్థులకు నూతనంగా నిర్మించిన శౌచాలయాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మన కళాశాలను,  పాఠశాలలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ పేద విద్యార్థులు చదువుకుంటారని వారికి వీలైనంతవరకు సౌకర్యాలు కల్పించాలని అది మనందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

ఈ కళాశాల అతి పురాతనమైనదని అందుకే త్వరలో కళాశాలలకు  పూర్తిస్థాయిలో  నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు అందించమని కళాశాల సిబ్బందికి సూచించారు. మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని,  ఒక్క వ్యక్తితో అది సాధ్యం కాదు కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.  అందుకే మహబూబ్ నగర్ విద్యానిధి ఏర్పాటు చేశామని బాధ్యత కలిగిన పౌరులు సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విద్యానిధికి సహకరించాలని, చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ విద్యా నిధి(Mahabubnagar Education Fund) పారదర్శకంగా అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రతి నెల తన జీతం నుంచి లక్ష రూపాయలు విద్యానిధిలో జమ చేస్తున్నట్టు ఆయన మరోసారి తెలిపారు. ఈ సందర్భంగా   విద్యార్థులు మాట్లాడుతూ మాకు మా గురించి ఆలోచించి మా బాధలు అర్థం చేసుకొని మాకు శౌచాలయాలను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి,  కళాశాల విద్యార్థులు, విద్యార్థినిలు అధ్యాపకులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం గోవిందరాజులు, ముడా చైర్మన్  లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు ఏసు దాస్, సుధాకర్ రెడ్డి, రామచంద్రయ్య, రాజు గౌడ్, మోయీజ్,  ప్రవీణ్ కుమార్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.