10-03-2025 05:27:59 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మామడ మండలంలోని ఫోన్ కాల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సోమవారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ శిఖర ప్రతిష్టాపన పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకన్ రెడ్డి సీనియర్ నాయకులు సత్తన్న గౌడ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.