calender_icon.png 1 April, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేతంపూడి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే

30-03-2025 11:02:12 PM

టేకులపల్లి (విజయక్రాంతి): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టేకులపల్లి మండలం బేగంపూడి గ్రామ సమీపంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే కోరం కనకయ్య పూజలు నిర్వహించారు. ఏటా ఉగాది రోజున దేవాలయంలో జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. పూజా కార్యక్రమంలో పాల్గొని పూజారులతో ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఈది గణేష్, బండారు నర్సింహారావు, కుర్రా అనిల్, రేఖ రాంబాబు, వీర్ల చిన్న వెంకటేశ్వర్లు, పెద్ద వెంకటేశ్వర్లు, సామినేని సాయి, సామినేని సతీష్, దొండ నర్సింహారావు, రేఖ రాంబాబు, లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.