నిర్మల్ (విజయక్రాంతి): ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం జరుగుతుందని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) అన్నారు. నిర్మల్ పట్టణంలోని తన నివాసభనులో ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సారంగాపూర్ మండలంలోని నామ్దేవ్ జాతరలో పాల్గొని పూజలు నిర్వహించి జాతర విశేషాలను తెలుసుకున్నారు. దిల్వార్పూర్ మండలంలోని సిర్గాపూర్ వడ్డేపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్లు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.