calender_icon.png 18 March, 2025 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారంలో ముందన్న ఎమ్మెల్యే

18-03-2025 12:20:59 AM

ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణపై నేడు అసెంబ్లీలో ప్రశ్నించనున్న అనిరుధ్‌రెడ్డి 

మహబూబ్ నగర్ మార్చి 17 (విజయ క్రాంతి) : మన రాష్ట్రమైన ఇతర రాష్ట్రమైన ప్రజా సమస్యలు ప్రజాప్రతినిధుల సమస్యల సైతం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవడంలో ముందు వరుసలో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఇప్పటికే పలు అంశాలను అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిలో గాని ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ సవిధానంగా విన్నవించడంతోపాటు ఆ సమస్య పరిష్కరించడంలో ఉన్న ప్రాధాన్యతను చెప్పడంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు అసెంబ్లీ సమావేశంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టికి పలు అంశాలను చర్చించే క్రమంలో ఎమ్మెల్యే అనిల్ రెడ్డి ప్రశ్నించేందుకు సమయతమవ్వడం జరిగింది.

ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశ పెట్టడంలో భాగంగా ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశంపై అసెంబ్లీలో తాను వేసిన ప్రశ్న మంగళవారం చర్చకు రానుందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై సోమవారం  విడుదల చేసిన ప్రకటనలో ఎమ్మెల్యే పలు అంశాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై తాను వేసిన ప్రశ్న మంగళవారం నాడు అసెంబ్లీలో చర్చకు రానుందని వివరించారు.

టీ-ప్రైడ్ సబ్సిడీ బకాయిలపై సమాధానం వస్తుందని, అలాగే టీ-ప్రైడ్ పథకంలో బాగంగా ఎస్సీ, ఎస్టీ యువతకు, దివ్యాంగులకు వాహనాల కొనుగోలు కోసం ఇవ్వాల్సిన 45% సబ్సిడీని ఏళ్ల తరబడిగా ఇవ్వకుండా యువతను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇబ్బందుల పాల్జేసిన విషయంగా  తాను వేసిన ప్రశ్న సోమవారం నాడు చర్చకు రాగా, సమయానుభావం కారణంగా ఆ ప్రశ్నపై చర్చ జరగలేదని అనిరుద్ చెప్పారు.

ఈ అంశం గురించి జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన అనేక మంది గిరిజన యువకులు తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. 2019 నుంచి పెండింగ్ లో ఉన్న ఈ రాయితీ మొత్తాలను ప్రభుత్వం ఎప్పటి లోపుగా చెల్లిస్తుందనే విషయం దీంతో స్పష్టం కానుందని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.