10-02-2025 08:17:32 PM
మహబూబ్ నగర్: ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న సేవాలాల్ మహారాజ్ 286 జయంతి ఉత్సవాల గోడ పత్రికను మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలని ఆయన సూచించారు. సేవాలాల్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ కార్యక్రమంలో యం.రఘువీర్ సింగ్, ఆర్ రవి రాథోడ్, రాజు నాయక్, శివ నాయక్ డాక్యా నాయక్, పీన్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.