స్థానికుల ఫిర్యాదు మేరకు వెళ్లి పరిశీలించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే విస్తూ పోయేలా రోడ్డు కబ్జాలు
కామారెడ్డి (విజయక్రాంతి): నమ్మశక్యం కాని నిజం అంటే ఇదేనేమో.. స్థానికులు చెబితే నమ్మబుద్ది కాక వెళ్లిన ఎమ్మెల్యేకు విస్తూ పోయే నిజాలు కనిపించాయి. మనం జిల్లా కేంద్రంలో ఉన్నామా లేదా ఓ మారుమూల గ్రామంలో ఉన్నామా అనే విధంగా మార్గదర్శకంగా పేరు ఉన్న కాలనీల్లో అన్ని అక్రమాలే జరుగుతున్నాయి. కనీసం 10 పీట్ల రోడ్లు వదలకుండా కబ్జా చేసేసి ప్లాట్లుగా మార్చేశారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పర్యటనలో విస్తుపోయే విషయాలు కనిపించాయి.
ఇంత అన్యాయమా అంటూ ఎమ్మెల్యే మక్కున వేలుసుకునే విధంగా టీచర్ కాలనీల్లో రోడ్లను కబ్జా చేసిన పరిస్థితులను మొయిన్ డ్రైనేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు ఆలోచించే విధంగా జరిగిన పనులు ఎమ్మెల్యేకే షాక్ గురిచేశాయి. ఎన్నో నెలల నుంచి టీచర్స్ కాలనీల్లో జరుగుతున్న అక్రమణాలు అవకతవకల గురించి స్థానికులు ఎమ్మెల్యేకు పిర్యాదులు చేస్తున్నారు. మంగళవారం వెళ్లి పరిశీలిస్తుంటే స్థానికులు చెప్పిన సమస్యలు ఉండడే కాకుండా రోడ్డునే కబ్జా చేసి పాట్లుగా మార్చిన విషయాలు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని విసుగుపోయేలా చేశాయి. రోడ్డు ఎమ్మెల్యే ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. స్థానికులకు సమస్యలను పరిష్కారిస్తామని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు. అనంతరం కామారెడ్డి మండలం క్యాసంపల్లిలో ప్రాథమిక పాఠశాలలో తరగతి గదిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బాలకిషన్‌గౌడ్, రాజిరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.