calender_icon.png 7 February, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

07-02-2025 05:03:29 PM

చెన్నూర్ (విజయక్రాంతి): చెన్నూర్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని శుక్రవారం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయేరియాతో బాధపడుతున్న రోగులను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మున్సిపాలిటీలో తాగునీరు సమస్యను పరిష్కరించాలని, బట్టిగూడెం, జెండావాడలో మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందిస్తున్నామని, బోనాల జాతరతో నీళ్లు కలుషితం కావడం వల్లనే వాంతులు, విరోచనాలతో ప్రజలు బాధ పడుతున్నారన్నారు. బతుకమ్మ వాగు నుంచి కాకుండా గోదావరి నీళ్లు వచ్చేలా చూస్తున్నామని, అమృత్ పథకంతో నీళ్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంపై కలెక్టర్ తో మాట్లాడి నిధులు కేటాయించి సమస్యకు శాశ్వత పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.