కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మండలం సీతారాంపల్లిలో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలను శనివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు బదిలీ అయిన ఎస్ ఓ మంగమ్మను తొలగించాలని విద్యార్థులు శుక్రవారం పాఠశాల వద్ద ఆందోళన చేసిన విషయం విధితమే. విద్యార్థులు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చిందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చిన తన దృష్టికి చేస్తే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే విద్యార్థులకు హామీ ఇచ్చారు. విద్యార్థినీలు పాఠశాలలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు వెంటనే ఎమ్మెల్యే డీఈవో రాజుతో మాట్లాడారు.