calender_icon.png 23 January, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

04-09-2024 02:47:40 PM

ఆదిలాబాద్, (విజయక్రాంతి): నిరుపేదల వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి డబ్బులు ఎంతగానో దోహదపడుతాయని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలం లోని అర్లి గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా సీ.ఎం.ఆర్.ఎఫ్ నిధుల నుండి మంజూరైన ధనోర గ్రామానికి చెందిన వనిత కు రూ. 12,500, ఉండం గ్రామానికి చెందిన వినాయక్ కు రూ. 13,000,  గుడిహత్నూర్ కు చెందిన నర్సింహ రావ్ కు మంజూరు అయిన రూ. 48,000 ల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు,గ్రామస్థులు ఉన్నారు.