పేద విద్యార్థుల పట్ల మానవత్వం చాటుకున్న.. ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలో ఎర్రఫహడ్ గ్రామానికి చెందిన డి.అనూష తండ్రి ఎల్లయ్య ఎంబీబీఎస్ సీటు వచ్చిన సందర్భంగా వారికి (Rs.100000)లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించి, కష్టపడి చదువుకొని డాక్టర్ అవ్వాలని ఆశీర్వదించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పేద విద్యార్థుల చదువు కోసం, తాను సాయ శక్తుల సహకరిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద విద్యార్థుల ప్రయోజనాల దుష్ట కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కిందని అన్నారు. గత పాలకుల కాలంలో విద్యార్థులకు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా కష్టాలు చవి చూశారని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.