calender_icon.png 15 January, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకులతో కలిసి పతంగులు ఎగురవేసిన ఎమ్మెల్యే

15-01-2025 07:31:26 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ లో జరిగిన సంక్రాంతి పండగ వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) పాల్గొన్నారు. పండగ సందర్భంగా స్థానిక కోలిపూర్ కాలనీలో యువకులు పతంగులను ఎగరవేసే సబురంలో ఎమ్మెల్యే ఉత్సాహంగా పాల్గొన్నారు. అటు ఎమ్మెల్యే సైతం స్వయంగా పతంగులను ఎగురవేసి యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టత ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతులు పాడి పంటలు సిరిసంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అటు పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మాంజాను ఉపయోగించవద్దని దానితో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని యువకులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, నాయకులు జోగు రవి, అర్జున్, మయూరి చంద్ర, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.