వనపర్తి, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా కేంద్రంతోపాటు గోపాల్‌పేట, రేవల్లి, ఖివల్లి ఘణపురం మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద మంగళవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య పాల్గొన్నారు.