calender_icon.png 29 September, 2024 | 7:03 PM

ఎమ్మెల్యే వర్సెస్ షాడో ఎమ్మెల్యే!

29-09-2024 12:25:43 AM

చెన్నూర్‌లో ఆసక్తికరంగా రాజ‘కీ’యం 

చిచ్చుపెట్టిన శనిగకుంట మత్తడి పేల్చివేత

రెండు వర్గాలుగా చీలిన స్థానిక నేతలు  

మంచిర్యాల, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియో జకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ షాడో ఎమ్మె ల్యే అనే చర్య ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మా రింది. శనిగకుంటకు దాపురించిన శని తిరిగి తిరిగి రాజకీయ నాయకులకు అంటుకుంటు ంది.

అధికారంలో ఉన్నాం.. ఏంచేసినా నడుస్తుందిలే అనుకున్న నాయకుల చుట్టూ ఉ చ్చు బిగుస్తుంటే వారి అసలు రంగు బయటపడుతుంది. శనగకుంట చెరువు 348, 36 5 సర్వే నంబర్లలో సుమారు 39 ఎకరాల వి స్తీర్ణంలో ఉండగా ఎఫ్‌టీఎల్ 42 ఎకరాలు, శిఖం 33.22 ఎకరాల్లో ఉంది.

రియల్ ఎస్టే ట్ వ్యాపారులు వారి స్వార్థ్యం కోసం మత్తడి పేల్చడంతో ఈ చెరువుపై ఆధారపడి 43 ఎ కరాల్లో సాగు చేస్తున్న రైతులకు నష్టం వాటిల్లుతుండగా, చెరువులో చేప పిల్లలు వేసిన మత్స్యకారులకు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు ప్రజలంతా ముక్తకంఠంతో దోషులను శిక్షించాలనే డిమాండ్ చేస్తుండటంతో.. మొదట తూతూ మంత్రంగా ప్రారంభించిన విచారణను పోలీసులు ప్రస్తుతం వేగం పెంచినట్టు తెలుస్తోంది.

అసలేం జరుగుతోంది 

శనిగకుంట మత్తడి బ్లాస్టింగ్ కేసు మలుపులు తిరుగుతోంది. మొదట కొందరిని అరెస్టు చూపించిన పోలీసులు.. ఎఫ్‌టీఎల్‌లో మట్టి నింపిన వారిని, జిలిటిన్ స్టిక్స్ ఎక్కడ నుంచి తీసుకువచ్చారనే దానిపై పట్టించుకోవడం లేదని ప్రజల్లోంచి ప్రశ్నలు రావడంతో ఆ వైపుగా విచారణ జరిపి అరెస్టు చూపే ప్రయత్నం చేసి వదిలిపెట్టారు.

అసలు మత్తడి పేల్చడానికి ఉపయోగించిన జిలెటిన్ స్టిక్స్ ఎక్కడివి? జిల్లాలోని ఓపెన్ కాస్టులు, భూగర్భ గనులలో ఉపయోగించే మందుగుండు పాతరలే ఇవా? ఇవి ఎక్కడి నుంచి తీసుకువచ్చా రు? ఎన్ని ఉపయోగించారు? ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయనే? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు షాడో ఎమ్మెల్యే బంధువు ఒకరు (వరుసకు కొడుకు) సింగరేణి బొగ్గు గనుల్లో ఒక ఎక్స్‌ఫ్లోజివ్ మ్యాగ్జిన్ (బారిక్)కు మేనేజర్‌గా పని చేస్తున్నారని, ఆయనే వీటిని తీసుకువచ్చారనే అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసులు చెప్పినట్టుగా ఖమ్మం నుంచి తీసుకువస్తే ఇంత దూరం ఎలా తీసుకువచ్చారు? అనే ప్రశ్న తలెత్తుతుంది.

పోలీసులు సైతం విచారణ జరుపుతున్నామం టూ దాట వేస్తున్నారే తప్ప కచ్చితమైన వివరాలు వెల్లడించకపోవడం అనేక సందేహాల కు తావిస్తోంది. ఈ విషయమై చెన్నూర్ సీఐ ని సంప్రదించగా ఆయన సమాధానం ఇవ్వలేదు.

కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్

చెరువు మత్తడి ధ్వంసం కేసులో చెన్నూర్ ఎమ్మెల్యేకు, షాడో ఎమ్మెల్యేగా పేరొందిన కాంగ్రెస్ నాయకుడి మధ్య కోల్డ్ వార్ మొదలైంది. మత్తడి పేల్చివేతకు కారణమెవరైనా శిక్ష తప్పదని ఎమ్మెల్యే చెప్తుంటే.. ప్రధాన నిందితులను రక్షించేందుకు షాడో ఎమ్మెల్యే రంగప్రవేశం చేశాడని తెలిసింది. అందుకే అరెస్టు చేసిన నాయకులను సైతం పోలీసులు వదిలారని ప్రజలు చర్చించుకు ంటున్నారు.

దీనికితోడు శనివారం ఎమ్మెల్యే వివేక్ చెన్నూర్‌లో నిర్వహించిన మహాలక్ష్మీ లబ్ధిదారులకు ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమానికి సైతం ఈ షాడో ఎమ్మెల్యేతోపాటు కేసులో అనుమానితులుగా ఉన్న వారెవ్వరూ హాజరు కాకపోవడంతో విషయం తేటతెల్లమైంది. పార్టీ కార్యక్రమంలో పాల్గొనకుండా షాడో ఎమ్మెల్యే ఇంట్లో అందరు మకాం పెట్టారు.

తమకు సఫోర్టు చేయకుంటే పార్టీకీ రాజీనామా చేస్తామని, ఎందులోనూ సఫోర్టు చేయమనే సంకేతాలను ఆ వర్గం తరఫున ఎమ్మెల్యేకు చేరవేసినట్టు సమాచారం. ఎమ్మెల్యే వారికి లొంగి నిందితులకు సపోర్టు చేస్తారా? లేక న్యాయం కోసమే పోరాడుతారా? ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాల్సిందే.  

మెడకు చుట్టుకున్న మత్తడి పేల్చివేత 

ఈ నెల 16న శనిగకుంట మత్తడిని దుం డగులు పేల్చగా ఈ కేసులో బాధ్యులుగా పెండ్యాల లక్ష్మీనారాయణ (చెన్నూర్), భీం మధూకర్ (చెన్నూర్), రసమల్ల శ్రీనివాస్ (చెన్నూర్), గోగుల దానయ్య (మంచిర్యాల)ను పోలీసులు అరెస్టు చూపించారు. ఈ నెల 22న ‘అసలును వదిరి.. కొసరును చూపిం డ్రు’ పేరిట ‘విజయక్రాంతి’ లో కథనం ప్రచురితం కాగా సీరియస్‌గా తీసుకున్న పోలీసు లు ఈ నెల 27న అసలోల్లను చూపెట్టే ప్ర యత్నం చేశారు.

అందుకోసం తెల్లవారుజామున ౪ గంటలకే వారి ఇండ్లకు వెళ్లగా కాం గ్రెస్ లీడర్లు గొడిసెల బాపురెడ్డి, శ్రీనివాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజబాబు మాత్ర మే పోలీసులకు దొరికారు. ఈ విషయం బయటకు లీక్ కావడంతో బత్తుల సమ్మ య్య, రాంలాల్ గిల్డాలు పరారయ్యారు. త ర్వాత పట్టుకున్న వారిని సైతం పోలీసులు వదిలేశారు.