calender_icon.png 7 April, 2025 | 12:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాములోరి సన్నిధిలో ఎమ్మెల్యే పూజలు

06-04-2025 12:32:26 PM

మందమర్రి,(విజయక్రాంతి): శ్రీరామనవని నవమిని పురస్కరించుకొని మున్సిపాలిటీ పరిధిలోని నార్లపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని రామాలయంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం రామాలయం దర్శనానికి రాగ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పురోహితులు వేద మంత్రొచ్చరణల నడుమ రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రామాలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. వార్డులో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఇంచార్జ్ అంకం రాజ్ కుమార్, సీనియర్ నాయకులు చేగొండ శంకరయ్య, ఏనుగుల బీరయ్య, గోపతి శ్రీనివాస్, బొలిశెట్టి వేణు, కోరే చిన్న గట్టయ్య, యువ నాయకులు ప్రణయ్, సోషల్ మీడియా ఇన్చార్జి రాజ్ కుమార్,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.