31-03-2025 07:31:19 PM
పాపన్నపేట: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సోమవారం పాపన్నపేట మండలంలో విస్తృతంగా పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆదివారం సాయంత్రం కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేష్ గుప్త సతీమణి త్యార్ల సుజాత ప్రమాదవశాత్తు జారిపడి మరణించగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన నివాసానికి చేరుకొని రమేష్ గుప్తను పరామర్శించారు. అదేవిధంగా గాంధారిపల్లి థామస్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కుర్తివాడలో పట్లోళ్ల చంద్రప్ప, వడ్డేపల్లి దేవి రెడ్డిలు అనారోగ్యంతో మృతి చెందగా పట్లోళ్ల నాగరాజు ను, వడ్డేపల్లి సంజీవరెడ్డిలను పరామర్శించారు. అనంతరం దౌలాపూర్ కు చేరుకొని రాజా శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించారు. రాజా శ్రీధర్ రెడ్డి మృతి చెందడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, గోవింద్ నాయక్, రమేష్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, మెదక్ వెంకటరమణ, శ్రీధర్, బల్వంతరావు, ఏగొండ, రాజేందర్, నరేష్, నరేందర్ గౌడ్, కిష్టయ్య తదితరులు ఉన్నారు.