అచ్చంపేట, జనవరి 13 : నల్లమల అటవీ క్షేత్రంలోని అక్కమాహదేవి గుహల సందర్శనకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ టూరిజం అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకష్ణ ఎకో టూరిజం దోమలపెంట రేంజ్ పరిధి నుండి అకమహాదేవి గుహలకు సఫారీ వాహనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లమల అభయారణ్యంలోని పర్యాటక కేంద్రాలను అన్ని విధాల అభివద్ధి చేస్తామన్నారు. శ్రీశైలం నది గుండా లాంచ్‌లో ప్రయాణించి అక్రమాదేవి గుహలను సందర్శించడానికి అటవీశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. అక్క మహాదేవి గుహల సందర్శన కోసం పర్యాటకులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.