calender_icon.png 5 February, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

17-01-2025 04:59:06 PM

యాదాద్రి భువనగిరి (విజయకాంతి): మహారాష్ట్రలోని షిర్డీ జౌరంగబాద్ మధ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్(MLA Mandula Samel) పరామర్శించి ఓదార్చారు. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప వాస్తవ్యులు ఓకే కుటుంబానికి చెందిన నలుగురు శ్యామ్ శెట్టి ప్రేమలత, ప్రసన్న, లక్ష్మీ అక్షిత వైద్విక్ (6 నెలల) మృతి చెందిన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ గురువారం రాత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి.. మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. తాను ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అదుకుంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుర్రం లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు గౌడ్ లెంకల వేణు ఎర్రవెల్లి కృష్ణ, నోముల రమేష్ నేత, పల్లపు సమ్మయ్య తొంట ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.