ఎల్బీనగర్, మే 17 : చంపాపేట డివిజన్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రధాన కాలనీల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులను త్వరగా పూర్తి చేయిస్తానన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ డ్రైన్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు, మ్యాన్‌హోల్ పనులను పూర్తి చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. సూర్యానగర్ కాలనీలో ఎస్ఎన్డీపీ పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరారు.
నాలా పక్కన పార్కు నిర్మాణం చేపట్టాలన్నారు. తర్వలో పనులను ప్రారంభించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అసంపూర్తిగా ఉన్న ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డివిజన్లో అవసరమైన చోట్ల రోడ్డు, సీసీ రోడ్డు వేస్తామని స్థానికులకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎన్డీపీ ఈఈ కృష్ణారావు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాజీరెడ్డి, నాయకులు సుంకోజు కృష్ణమాచారి, శ్రీనివాస్, ఉమామహేశ్వర్, సదానంద్‌రెడ్డి, మల్లేశ్, జగదీశ్, శ్రీకాంత్, చందు పాల్గొన్నారు.