calender_icon.png 3 April, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు బెల్లంపల్లిలో ఎమ్మెల్యే వినోద్ పర్యటన

02-04-2025 10:42:02 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలో గురువారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో గల నెల్కో లైన్ లోని రేషన్ షాపులో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 11 గంటలకు మండలంలోని పెద్దబూద గ్రామంలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వినోద్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కాసిపేట మండలం దేవాపూర్ గ్రామపంచాయతీలో వాటర్ షెడ్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాసిపేట మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేయనున్నారు.