23-03-2025 07:26:04 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తీలో ఆదివారం స్థానిక ప్రజలు, కమిటీ సభ్యులు ఘనంగా ఏర్పాటు చేసిన భూలక్ష్మి, మహాలక్ష్మి దేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొని ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. బూడిదగడ్డ బస్తి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా భూలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలను ఊరేగించారు. మహిళలు ప్రత్యేకమైన వస్త్రధారణతో అమ్మవారిని పూజిస్తూ ఆరాధించారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బూడిదగడ్డబస్తి ప్రజలు, భూలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవారి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బస్తీ వాసులకు అన్నదానం ఏర్పాటు చేశారు.