14-04-2025 12:54:43 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని పలుచోట్ల సోమవారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొని మహనీయునికి నివాళులర్పించారు. బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అతను చేసిన త్యాగాన్ని కొనియాడారు. మహనీయులు అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. అనంతరం ఏఐసీసీ ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదుగా కాంట అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నూతరి స్వామి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.