బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలంలో గల నీల్వాయిలో 18 మంది లబ్ధిదారులకు రూ 1,800,288 చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రుద్ర బట్ల సంతోష్, సాబీర్, స్థానిక నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.